Saturday, November 2, 2024

హైడ్రాకు బల’గం’.. ఇక ఆగేనా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైడ్రాను మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఫోర్స్‌ను కేటాయించింది. ఇటీవల ఓఆర్‌ఆర్ లోపలివైపున ఉన్న చెరువుల్లో, నాలాలపైన ఉన్న అక్రమ నిర్మాణాలను వరుసగా నేలమట్టం చేస్తూ వస్తోంది. అయితే, హైడ్రాకు అధికారుల కొరత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖకు అధికారులను కేటాయించాలని కోరుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ లేఖ రాశారు. అందుకు స్పందించిన పోలీసు అదనపు డీజి(ఎల్‌ఓ) మహేశ్ భగవత్ 23 మంది పోలీసు అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 15 మంది ఇన్‌స్పెక్టర్‌లను, 3 రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌లను, 2 రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌లను, 3 స బ్ ఇన్‌స్పెక్టర్లను హైడ్రాకు మహేశ్‌భగవత్ కేటాయించారు.

అయితే, వాస్తవానికి హైడ్రా కమిషనర్ మొత్తం 259 మంది పోలీసు అధికారులను కేటాయించాలని ఈపాటికే ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఒక ఐపిఎస్ ఎస్‌పి, ముగ్గురు నాన్ ఐపిఎస్ కేటగిరిలోని డిఎస్‌పి స్థాయి అధికారులను, 21మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలు, ఐదుగురు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, 12 మంది రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, 101 మంది పోలీసు కానిస్టేబుళ్లను, 72 మంది హోమ్ గార్డులను, ముగ్గురు ఒక్కొక్కరు ముగ్గురు విశ్లేషణాధికారులను కేటాయించాలని అభ్యర్థిస్తూనే మొత్తం 3,500 పోస్టులను మంజూరు చేయాల్సిందిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గత ఆగష్టు 12న ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే పోలీసు విభాగం ముందుగా 23 మంది పోలీ స్ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News