Thursday, January 23, 2025

కూకట్‌పల్లిలో 230 కేజీల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి వై. జంక్షన్‌లో ఆదివారం సాయంత్రం మాదాపూర్ ఎస్‌వోటి అడిషనల్ డిసిపి శోభన్, శివప్రసాద్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండుగా రెండు ఇనోవా వాహనాల్లో సుమారు 230కిలోల గాంజా తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసిన సం ఘనట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం బాలానగర్ డిసిపి శ్రీనివాస్‌రావు అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

గాంజా సరఫరాలో ప్రధాన నిందుతుడై జహీరాబాద్‌కు చెందిన అర్జున్ ఆంధ్రప్రదేశ్‌లోని మారుడుమల్లి ప్రాంతం నుంచి గాంజాయి తీసుకువచ్చి జహీరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు మహమ్మద్ అఖీల్, షేక్ అల్లాఉద్దీన్, హూడేకర్ విజయ్, యం.డి వహీద్, అజిత్ వంశీల సహకారంతో తరలిస్తాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రెండు ఇనోవా వాహనాల్లో సుమారు 230 కేజీలా గంజా తరలిస్తున్న సమయంలో కూకట్‌పల్లి వై.జంకన్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసుల వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారని విచారించగా ఆంధ్రప్రదేశ్ నుంచి గంజా తీసుకువచ్చి వివిధ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటామని తెలిపారు. సుమారు 46 లక్షల విలువైన గాంజాతో పాటుగా రెండు ఇనోవా వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ పట్టుకున్న పోలీసులను డి సిపి శ్రీనివాస్‌రావు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News