Friday, November 22, 2024

ఎపిలో 23,160 కరోనా కేసులు : 106 మంది మృతి

- Advertisement -
- Advertisement -

23160 New Corona Cases Reported in AP

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా బారిన పడి చికిత్స పొందుతూ 106 మంది మృత్యువాత పడ్డారు. అలాగే మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం నాటికి రాష్ట్రంలో 24,819 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరుకోగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736గా ఉంది.

కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 9,686కు పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 17 మంది మృతిచెందగా, నెల్లూరు, విశాఖపట్నంలో 11 మంది చొప్పున, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, అనంతరపురం, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 8 మంది చొప్పున, గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు చొప్పున ప్రాణాలు వదిలారు. ఇక, అత్యధికంగా తూర్పు గోదావరిలో 3,528 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నటికీ కోవిడ్ కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.

బాధితులకు బాసట : అనిల్ కుమార్ సింఘాల్
కరోనా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు బుధవారం ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. కరోనాతో కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుపై ప్రభుత్వం రూ.10 లక్షల డిపాజిట్ చేయనుందని తెలిపారు. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా ఇచ్చేలా లబ్దిదారులకు అందించేలా కార్యాచరణ రూపొం దించినట్లు సింఘాల్ తెలిపారు.

ప్రభుత్వాస్పత్రుల్లో 21,493 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ రోజువారి గరిష్ట వినియోగం 650 మెట్రిక్ టన్నులు కాగా అందుబాటులో 635 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థం ఉన్నట్లు చెప్పారు. ఆక్సిజన్ రవాణా కోసం 78 ట్యాంకర్లు, 14 చిన్న ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 4+2 ఐఎస్‌ఓ ట్యాంకర్లు కలిగిన 2 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ట్యాంకర్‌కు 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సామర్థం ఉంటుందని తెలిపారు.

23160 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News