Thursday, January 23, 2025

పిఇసెట్‌కు 2,340 మంది హాజరు

- Advertisement -
- Advertisement -

2,340 people attended PECET

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు టిఎస్ పిఇసెట్ పిజికల్ ఈవెంట్స్ విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేంద్రాలలో ఏర్పాటు చేసి ఒకే రోజులో పిఇసెట్ నిర్వహించారు.పిఇసెట్‌కు మొత్తం 3,659 మంది దరఖాస్తు చేసుకోగా, 2,340 మంది(64 శాతం) హాజరయ్యారు. అన్ని కేంద్రాలలో ఉదయం 8 గంటలకు క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయని పిఇసెట్ కన్వీనర్ వి.సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, మహత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, తుమ్ము కృష్ణలు బుధవారం నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో క్రీడా పోటీలను ప్రారంబించారు. ఈ సంధర్భంగా చైర్మన్ ఆర్. లింబాద్రి మాట్లాడుతూ, వ్యాయామ ఉపాధ్యాయులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.

జాతి నిర్మాణంలో, విద్యార్థుల క్రమశిక్షణ, దేశభక్తి పెంపుదలలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. యావత్ దేశం గర్వించదగ్గ ఎంతోమంది నైపుణ్యం గల క్రీడాకారులను వ్యాయామ ఉపాధ్యాయులు తర్ఫీదు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సైతం అటువంటి ప్రతిభావంతులైన ద్రోణాచార్యులు తయారు కావాలని ఆకాంక్షించారు. వ్యాయామ విద్యలో నానాటికి మహిళల భాగస్వామ్యం పెరుగుదల ఒక శుభ పరిణామం అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 కేంద్రాల్లో నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 పరీక్ష విజయవంతంగా ముగియడం పట్ల పిఈసెట్ కన్వీనర్ వి.సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News