Friday, November 22, 2024

‘ఆపరేషన్ అజయ్’.. రెండో విడతలో భారత్‌కు 235 మంది చేరిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దీంతో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండో విడతలో మరో 235 మంది భారతీయులతో కూడిన విమానం శనివారం ఉదయం ఢిల్లీ చేరుకుంది. తెల్లవారు జామున స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయం మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ స్వాగతం పలికారు.

హమాస్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నుంచి తమను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా మొదటి విడతలో 212 మందిని స్వదేశానికి తీసుకురాగా, శనివారం మరో 235 మంది భారత్‌కు చేరుకున్నారు. మిగిలిన వారిని విడతల వారీగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News