న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 15,06,254 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 23,529 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించారు. ఇక, కరోనాతో మరో 311మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 3.37కోట్లకు పైగా పెరిగింది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,48,062 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 28,718 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3.30కోట్లకు పైగా బాధితులు కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,77,020 కరోనా కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు 88,34,70,578 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఇప్పటివరకు 88.34 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ పేర్కొంది.
23529 New Corona Cases Reported in India