Wednesday, January 22, 2025

10 నెలల్లో 2366 మంది రైతులు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : మహారాష్ట్రలో గడచిన పదినెలల్లో (జనవరి నుంచి అక్టోబర్) 2366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అమరావతి డివిజన్ లోనే అత్యధికంగా 951 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తేలింది. ఛత్రపతి శంభాజినగర్ డివిజన్‌లో 877,నాగ్‌పూర్ డివిజన్‌లో 257, నాసిక్ డివిజన్‌లో 254, పుణె డివిజన్‌లో 27 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర సహాయ పునరావాస శాఖ మంత్రి అనిల్ బైదాస్ వెల్లడించారు . రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ సభ్యుడు కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. బాధిత కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వ రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News