Wednesday, January 22, 2025

రెండో రోజూ రెండు వేలపైనే కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2380 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కొత్త కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కేరళ, మిజోరం, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా వైరస్ ఉనికి చాటుతోంది. గురువారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో బుధవారం 4.49 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, 2380 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒక్క ఢిల్లీ నుంచే 1,009 కేసులొచ్చాయి. అక్కడ ఒక్క రోజులో కేసుల్లో 60 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు 5.7 శాతానికి పెరిగింది.

24 గంటల వ్యవధిలో 56 మంది మృతి చెందారు. కేరళ మృతుల సంఖ్య 53 కాగా, ఢిల్లీ, ఒడిశా, మిజోరంలో ఒక్కో మరణం సంభవించింది. బుధవారం 1231 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. గత కొద్ది రోజులుగా కొత్తకేసుల కంటే రికవరీలు తక్కువగా ఉంటున్నాయి. దాంతో క్రియాశీల కేసులు 13,433 కి పెరిగాయి. ప్రస్తుతం రివకరీ రేటు 98.76 శాతం ఉండగా, క్రియాశీల రేటు ౦.౦౩ శాతంగా కొనసాగుతోంది. మరోపక్క బుధవారం 15.47 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 187 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

97 శాతం నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్

న్యూఢిల్లీలో ఈ జనవరి నుంచి మార్చి వరకు సంభవించిన కొవిడ్ మృతుల నమూనాలను పరిశీలించగా, 97 శాతం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు తేలింది. 578 నమూనాల జన్యుక్రమాన్ని విశ్లేషించగా, 560 నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మిగిలిన నమూనాల్లో డెల్టాతోసహా ఇతర వేరియంట్లు ఉన్నట్టు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News