మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 2,384 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 307 మంది ఉండగా ఆదిలాబాద్ 11, కొత్తగూడెం 113, జగిత్యాల 41, జనగామ 33,భూపాలపల్లి 57, కామారెడ్డి 13, కరీంనగర్ 103, ఖమ్మం 167, ఆసిఫాబాద్ 15, మహబూబ్‌నగర్ 81, మహబూబాబాద్ 44, మంచిర్యాల 75, మెదక్ 23, మల్కాజ్‌గిరి 116, ములుగు 45, నాగర్ కర్నూల్ 28, నల్గగొండ 170, నారాయణపేట 13, నిర్మల్ 9, నిజామాబాద్ 21, పెద్దపల్లి 95, రాజన్న సిరిసిల్లా 45, రంగారెడ్డి 135, సంగారెడ్డి 59, సిద్ధిపేట్ 102, సూర్యాపేట్ 90, వికారాబాద్ 63, వనపర్తి 45, వరంగల్ రూరల్ 63, వరంగల్ అర్బన్ 86, యాదాద్రి భువనగిరిలో 31 కేసులు తేలాయి. అదే విధంగా వైరస్ దాడిలో మరో 17మంది చనిపోగా, ఇప్పటి వరకు వైరస్ దాడిలో మరణించిన వారి సంఖ్య 3313కు చేరింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5,83,228కు చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 5,46,536కి పెరిగింది. అయితే ప్రస్తుతం 33,379 యాక్టివ్ కేసులుండగా, 85శాతం మంది ఐసోలేషన్ సెంటర్లలోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఆసుపత్రుల నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగిందని డాక్టర్లు అంటున్నారు. దీంతోనే రాష్ట్రంలో రికవరీ రేట్ 93.70 శాతం నమోదవుతుంది.
2384 New Corona Cases Reported in Telangana