Saturday, December 28, 2024

ఉస్మానియాలో ఆర్వో ప్లాంటు 23వ వార్షికోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు అని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి, హేల్పే నీ డి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ఆరోప్లాంటు 23వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య ఆతిధిగా పాల్గొని , జిహెచ్‌ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ జి శంకర్ యాదవ్ , గోశామహల్ బిఆర్‌ఎస్ ఇంచార్జి నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్, బిఆర్‌ఎస్ సీనియర్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా ప్రతి రోజు పత్రిక వచ్చే రోగుల కు, వారి సహాయకులకు 15వేల లీటర్ల మంచి నీ టిని ఉచితంగా అందిస్తూ, వారి సేవా భావాన్ని కొనసాగించడం గొప్ప విషయమని బాస్ సేవలను డా. నాగేందర్ కొనియాడారు. ఈసందర్భంగా ఆర్వో ప్లాంటుకు సహకరించిన దాతలను శాలువా తో స న్మానించి, మెమోంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్,బాస్ అధ్యక్షులు క్యాతం రాధాకృష్ణ,ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్, కోశాధికారి ఎం రాకేష్,ఉస్మానియా ఆసుప త్రి సర్జన్ ఆర్‌ఎంఓ డా.శేషాద్రి, ఆర్‌ఎంవోలు డా. ర ఫీ,బిఆర్‌ఎస్ నాయకులు ఎస్.ధనరాజ్, ఉస్మానియా వైద్య సిబ్బంది మోహన్, అనిల్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News