హోజాయ్: అస్సాం రాష్ట్రం హోజాయ్ జిల్లాలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో మరణించిన రోగి కుటుంబసభ్యులు ఓ జూనియర్ డాక్టర్ పై మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఓడాలిలోని కోవిడ్-19 ఆసుపత్రిలో కరోనా రోగి చనిపోయాడు. దీంతో బంధువులు యువ వైద్యుడిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఐఎంఎ అస్సాం స్టేట్ బ్రాంచ్ బుధవారం రాష్ట్రంలోని వైద్యులందరూ వైద్య సేవలను మానుకోవాలని పిలుపునిచ్చింది. “ఈ అనాగరిక దాడిలో పాల్గొన్న 24 మంది నిందితులను అరెస్టు చేశారు. చార్జిషీట్ త్వరగా దాఖలు చేయబడుతుంది. నేను ఈ దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను. న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను ”అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేశారు. కాగా, యువ వైద్యుడు కుమార్ సేనాపతి ఎంబిబిఎస్ పూర్తి చేసిన అనంతరం గ్రామీణ ప్రాంతంలో విధుల్లోకి వెళ్లిన మొదటి దాడి అని అసోం శాసన సభ డెప్యూటీ స్పీకర్ డాక్టర్ నుమల్ మోమిన్ పేర్కొన్నారు.
Brutality against a Doctor post MBBS , rural posting is highly condemable . I demand an impartial inquiry and Strict action against those culprit. pic.twitter.com/dduekwvDih
— Dr Numal Momin MD. (@DrNumal) June 1, 2021
24 culprits involved in this barbaric attack have been arrested and the chargesheet will be filed at the earliest.
I am personally monitoring this investigation and I promise that justice will be served. https://t.co/CVgRaEW0di
— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2021