Saturday, November 16, 2024

23 వికెట్లతో 24ను ప్రారంభించారు… ఆశ్చర్యం?

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పేసర్లు విజృంభించారు. భారత్ బౌలర్లలో సిరిజ్ ధాటికి తొలి ఇన్నింగ్స్ సౌతాఫ్రికా 55 పరుగులకే పది వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కూడా 153 పరుగులు చేసి ఆలౌటైంది. చివరి పదకొండు బంతుల్లో ఒక్క పరుగు చేయకుండా ఆరుగురు ఔటయ్యారు చెత్త రికార్డును భారత్ మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ పరుగులు చేయకుండా ఆరుగు డకౌట్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలో 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 62 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఈ టెస్టు మ్యాచ్‌పై భారత దిగ్గజ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ స్పందించారు. 2024వ సంవత్సరం ఒకే రోజు 23 వికెట్లతో ప్రారంభమైందని, దీనిని నమ్మలేకపోతున్నానని సచిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా ఆలౌటైనప్పుడ తాను విమానం ఎక్కానని, ఇంటికి వచ్చేసరి సఫారీలు మూడు వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తుంది… ఈ మధ్యలో తాను ఏం మిస్సయ్యానని? అని సచిన్ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News