Monday, January 20, 2025

24 గంటల్లో 24 మంది శిశువుల కన్నుమూత

- Advertisement -
- Advertisement -

నాందేడ్ : మహారాష్ట్రలో మహా విషాదం నెలకొంది. నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలో 24 మంది శిశువులు మృతి చెందారు. కన్నుమూసిన చిన్నారులలో 12 మంది వరకూ అప్పుడే జన్మించిన నవజాత శిశువులు అని వెల్లడైంది. స్థానిక ప్రసవానంతరం తల్లీ పిల్లలకు అవసరం అయిన అత్యవసర ఔషధాలు సకాలంలో అందకపోవడం చిన్నారుల మృతికి దారితీసినట్లు వెల్లడైంది. నవజాత శిశువులలో ఆరుగురు ఆడపిల్లలు, ఆరుగురు మగవారని ఆసుపత్రి డీన్ తెలిపారు. మిగిలిన 12 మంది పలువ్యాధులు, పాముకాట్లుతో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు. చిన్నారులకు ఆసుపత్రిలో పాములు కరిచాయా? లేక పాముకాటుతో వారు ఆసుపత్రి పాలయ్యారా? అనేది ఏ అధికారి నిర్థారించలేదు.

అయితే సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం, అత్యవసర మందులు సరైన కోటాలో లేకపోవడం వల్ల చిన్నారులు మొగ్గలుగా రాలినట్లు వెల్లడైంది. పెద్ద ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లలేని తమకు పిల్లల మరణంతో కడుపుకోతలే మిగిలాయని తల్లులు రోదిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో జరిగిన దారుణ మరణాలపై రాజకీయ దుమారం నెలకొంటోంది. రాష్ట్రంలోని మూడింజన్ల షిండే శివసేన, ఫడ్నవిస్ బిజెపి, అజిత్ ఎన్‌సిపి పార్టీల ప్రభుత్వానిదే బాధ్యత అని ఉద్ధవ్ థాక్రే , పవార్ వర్గపు ఎన్‌సిపి నేతలు మండిపడ్డారు. సంబంధిత మంత్రి , ఆసుపత్రి జిల్లా అధికారులను వెంటనే బర్తరఫ్ చేయాలని శరద్ పవార్ కూతురు, ఎంపి సుప్రియా సూలే డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News