వరంగల్: ఒకప్పుడు కరెంట్ కోసామని అరిగోస పడ్డామని… ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శాయంపేట మండల కేంద్రంలో రైతు వేదికను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. కరోనా కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. వరి సాగులో వెదజల్లే పద్ధతి వల్ల చాలా లాభాలు ఉన్నాయని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని సిఎం కెసిఆర్ కోరారన్నారు. రైతు పండించి ప్రతి గింజను కెసిఆర్ ప్రభుత్వం కొన్నదని, ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాలు వస్తాయని, పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణా రెడ్డి, ఎంపి దయాకర్, వెంకటేష్, జడ్‌పి చైర్మన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు.
అప్పుడు కరెంట్ కోసం అరిగోస… ఇప్పుడు 24 గంటల కరెంట్: ఎర్రబెల్లి
- Advertisement -
- Advertisement -
- Advertisement -