Wednesday, January 22, 2025

24 గంటల విద్యుత్ సిఎం కెసిఆర్‌కే సాధ్యం

- Advertisement -
- Advertisement -

రఘునాథపాలెం : 24 గంటల విద్యుత్ ముఖ్యమంత్రి కెసిఆర్‌కే సాధ్యం అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో మండల పార్టీ అద్వర్యంలో ధర్నా చేపట్టారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. రేవంత్ దొంగ.. డౌన్ డౌన్.. రేవంత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఉచితాలు వద్దంటూ రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటున్నాడు.. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక 3గంటల కరెంట్ వస్తుందని, మళ్ళీ పాతరోజులు వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి.. అసలు ఏం తెలుసు నీకు రైతుల గురించి, వ్యవసాయం గురించి, కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే రైతులకు పవర్ క్యూట్ అవుతుందని పేర్కొన్నారు. 24 గంటలు విద్యుత్ ఇస్తే రైతులు తమకు అనుకూలమైన సమయంలో నీళ్ళు పెట్టుకుంటారు, సమయానికి అనుగుణంగా వ్యవసాయం చేస్తారని తెలిపారు. ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక పక్క బీజేపీ రైతుల మోటర్లుకు మీటర్లు పెట్టాలంటోంది, కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దు అంటోంది… ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని స్పష్టం గా అర్థమవుతుందన్నారు.

కాంగ్రెస్ హయాంలో రాత్రి కరెంట్ వల్ల కరెంట్ షాక్‌లు, పాము కాట్లతో రైతులు చనిపోయిన ఘటనలు అనేక ఉన్నాయని, నేను స్వయంగా చూశానని, పాము కాటు, తేలు కాటు కు గురై మమత ఆసుపత్రిలో చికిత్సలు పొందిన ఘటనలు చూశానని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలతో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి రుజువైందన్నారు. కాంగ్రెస్ పార్టీ దళారుల కోసం, బీజేపీ పార్టీ ఆదాని, అంబానీ కోసం పనిచేస్తే కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్నారని, రైతులు మేల్కొని కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు.మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తూ వస్తునే ఉందని, రైతుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. ఈ ధర్నాలో మంత్రి తోపాటు సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ అఫ్జల్, మార్కెట్ వైస్ చైర్మన్ మాజీ పిన్ని కోటేశ్వరరావు, సర్పంచుల సంఘం అధ్యక్షులు మాదంశెట్టి హరి ప్రసాద్, చింతగుర్తి సర్పంచ్ మెంటం రామారావు, మంచుకొండ సొసైటీ అధ్యక్షులు మందడపు సుధాకర్, నాయకులు మాధవరావు, నున్న శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News