- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 67140 మంది భక్తులు దర్శించుకున్నారు. 26870 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లుగా ఉంది.
- Advertisement -