- Advertisement -
లింగాపూర్: దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అందించిన ఘనత భారాస ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం లింగాపూర్ రైతువేధిక భవనంలో భారాస ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తుంటే, టిపిసిసి అద్యక్షులు మూడు గంటలే చాలని వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. తక్షణమే రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతన్నలకు క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అడే రక్కబాయి లక్యనాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -