Saturday, December 21, 2024

పాఠ్యపుస్తకాలు వెనక్కి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాల ని విద్యాశాఖ ఆదేశించింది. బుధవారం పాఠశాల ల్లో ఒకటవ తరగతి నుంచి పదోతరగతి వర కు వి ద్యార్థులకు అధికారులు పాఠ్యపుస్తకాలు వ ర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు.24 లక్షల మంది వి ద్యార్థులకు 2కోట్ల 10లక్షలు పాఠ్యపుస్తకాలు ము ద్రించారు.ఇందుకోసం రూ.120 కోట్లు వెచ్చించారు. ఇప్పుడు 24 లక్షల పుస్తకాలు తిరిగి వెనక్కు తీసుకుంటున్నారు. ఒక్క పుస్తకానికి క నీసం రూ. 20 ఖర్చు అయిందనుకున్నా వీటి విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని భావిస్తున్నా రు.

ఒక చిన్న ముద్రణ తప్పు వల్ల ఈ విద్యాశా ఖ పె ద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రా రంభించిన తొలిరోజు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామన్న ఆనందం ప్రభుత్వ వర్గాల్లో లేకుండా పో యింది. పాఠ్యపుస్తకాల్లో ముందు మాట మా ర్చకుండా ముద్రించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిం ది. దీంతో అన్ని పాఠశాలల హెడ్‌మాస్టర్ల నుండి ఒ కటి నుండి పదోతరగతి వరకు మొదటి భాష తె లుగు పాఠ్యపుస్తకాలను తక్షణమే సేకరించి భద్రపరుచాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News