Monday, November 18, 2024

ఛత్తీస్‌గఢ్‌లో 24మంది నక్సలైట్ల లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

24 Naxals surrender in Chhattisgarh

 

ముగ్గురిపై రూ.లక్ష రివార్డు

దంతేవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో 24మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 12మందిమహిళలున్నారు. మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగిందని దంతేవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ తెలిపారు. లొంగిపోయిన ముగ్గురిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉన్నదని ఆయన తెలిపారు. మావోయిస్ట్ అనుబంధ సంఘం డిఎకెఎంఎస్ నేత అయతు ముచకీ(31), ఇదే సంఘానికి చెందిన మరో నేత బమన్ డెంగాసోధి(40), కమిల్ మద్కమ్(32) లొంగిపోయినవారిలో ఉన్నారు.

వీరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉన్నది. లొంగిపోయిన వారందరికీ తక్షణ సాయం కింద రూ.10,000 చొప్పున ఇవ్వనున్నట్టు ఎస్‌పి తెలిపారు. లాన్ వర్రట్(గోండు భాషలో ఇంటికి తిరిగా రా అని అర్థం) పిలుపులో భాగంగా వీరు లొంగిపోయారని ఎస్‌పి తెలిపారు. దంతేవాడ జిల్లాలోని గ్రామాల్లో దీనికి సంబంధించిన పోస్టర్లను అతికించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాలో కనీసం 1600మంది మావోయిస్టుల్లో చేరినట్టు అంచనా. గతేడాది జూన్‌లో ప్రచారం ప్రారంభించగా, ఇప్పటివరకు 272మంది లొంగిపోయినట్టు ఎస్‌పి తెలిపారు. లొంగిపోయిన వారందరికీ ప్రభత్వ విధానంమేరకు పునరావాసం కల్పించి, వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పిస్తామని ఎస్‌పి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News