Saturday, December 21, 2024

కెనడాలో కాల్పులకు భారత విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: కెనడాలో చిరాగ్ అంటిల్(24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. దాంతో అతడు మృతి చెందినట్లు దక్షిణ వాంకోవర్ పోలీసులు తెలిపారు. ‘‘ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11.00 గంటల సమయంలో తూర్పు 55 అవెన్యూ నుంచి కాల్పుల శబ్దం వినిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి చూడగా కారులో చిరాగ్ విగత జీవిగా పడి ఉండడం కనిపించింది. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాకపోతే దర్యాప్తు జరుగుతోంది’’ అని వాంకోవర్ పోలీసులు తెలిపారు.

చిరాగ్ హరియాణకు చెందిన వ్యక్తి. అతడి మృత దేహాన్ని తీసుకురావడానింగ్ నిధులు పోగుచేస్తున్నట్లు అతడి సోదరుడు రోహిత్ అంటిల్ స్థానికి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు వరుణ్ చౌదరీ ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తును గమనించాల్సిందిగా ఆయన విదేశీ వ్యవహారాల శాఖకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News