Thursday, December 26, 2024

అకారణంగా దాడి చేసిన యువకుడికి 240 రోజుల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇంటి ఎదుట నిల్చున్న యువకుడిపై దాడి చేసిన మరో యువకుడికి 240 రోజుల జైలు శిక్ష, రూ.1,100 జరిమానా విధిస్తూ సికింద్రాబాద్ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సోమవారం తీర్పు ఇచ్చారు. పోలీసుల కథనం ప్రకారం… సూర్య అనే యువకుడు రాత్రి సమయంలో ప్రమాదకరమైన ఆయుధంతో తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే బేగంపేట అల్లంతోటబావి, మయూరి మార్గ్‌లో ఉంటున్న భరత్ కుమార్ డిగ్రీ చేస్తున్నాడు. ఈ నెల 19వ తేదీన రాత్రి సమయంలో తన స్నేహితుడు కొమ్మాల శివతో మాట్లాడుతున్నాడు.

ఈ సమయంలోనే సూర్య, అతడి ముగ్గురు స్నేహితులు అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే సూర్య, భరత్ కుమార్ చెంపపై కొట్టాడు, అంతటితో ఆగకుండా కడుపులో గుద్దాడు. దీంతో సూర్య, అతడి స్నేహితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా బాధితులు వెంటనే బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నిందితుడు దాగి ఉన్న ప్రాంతాన్ని కనిపెట్టి పట్టుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా కోర్టు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. కేసును ఎస్సై వరలక్ష్మి దర్యాప్తు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News