- Advertisement -
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీ నారసింహుడిని దర్శించుకునే భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు నూతనంగా నిర్మించిన 240 వసతి గదుల భవన సముదాయం సోమవారం ప్రారంభం కానుంది. ఈ సముదాయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో గీత ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణం అనంతరం భక్తులకు వసతి గదుల సౌకర్యం కోసం కొండ కింద తులసీ కాటేజీ వద్ద దాతల ఆర్థిక సహకారంతో నిర్మా ణం చేసిన 240 గదుల వసతి భవనం పూర్తి కావడంతో నూతన భవనం మంత్రులచే ప్రారంభించడం జరుగుతుందన్నారు. కాగా, భవనం ప్రా రంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయంతో రూ.12లక్షలు, రూ.6లక్షలు, రూ.5లక్షలతో కేటగిరిలో నిర్మాణం జరిగినట్టు ఈవో తెలిపారు.
- Advertisement -