Wednesday, January 22, 2025

తెలంగాణలో 2,421 కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

2421 new covid cases repored in telangana

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తెలంగాణలో 2,421 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 81,417 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,421 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,71,828కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,096కు చేరింది. తాజాగా కరోనా నుంచి 3,980 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,34,628 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.18 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 33,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 2,441 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News