- Advertisement -
అమరావతి: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఎపిలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,546 మందికి కరోనా టెస్టులు చేయగా.. 246 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 131 మంది కోలుకున్నారు. కోవిడ్ తో తాజాగా ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,92,986కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,83,890 మంది బాధితులు డిశ్చార్జ్ కాగా, 7,187 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆంధ్రలో 1,909 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి రాష్ట్రంలో 1,46,74,210 మందికి కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. కొత్తగా బయటపడిన కేసుల్లో గుంటూరు జిల్లాలో 58, చిత్తూరు జిల్లాలో 45 కేసులు రికార్డు అయ్యాయి.
- Advertisement -