Wednesday, January 22, 2025

దేశంలో కరోనా ఉప్పెన

- Advertisement -
- Advertisement -
247417 New covid cases reported in india
రెండున్నర లక్షల కొత్త కేసులు
ముందు రోజు కంటే 27 శాతం ఎక్కువ
5 వేలకు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
3 శాతానికి పెరిగిన క్రియాశీల రేటు

న్యూఢిల్లీ : దేశంలో కొత్త కేసులు తాజాగా రెండున్నర లక్షలకు చేరాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 5 వేలకు పెరిగాయి. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం బుధవారం 18 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేయించుకోగా, వారిలో 2,47,417 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ముందు రోజు కంటే 27 శాతం ఎక్కువగా కేసులొచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగింది. ఒక్క ఢిల్లీ లోనే 27,801 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మొదలైనప్పటి నుంచి అక్కడ రోజువారీ నమోదైన కేసుల్లో ఇది రెండో అత్యధికం. కరోనా మహారాష్ట్రలో తీవ్రంగా చెలరేగుతోంది. అక్కడ 46,723 మందికి వైరస్ సోకింది. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5 వేలు దాటాయి. బుధవారం కొత్తగా 620 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించగా, మొత్తం కేసులు 5,448 కి చేరాయి. 2162 మంది కోలుకున్నారు.

ఒమిక్రాన్ కేసుల పరంగా మహారాష్ట్ర ( 1367) ,రాజస్థాన్ ( 792), ఢిల్లీ (540),మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కరోనా తీవ్రత కారణంగా క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం వైరస్ బాధితుల సంఖ్య 11,17,531 కి చేరింది. క్రియాశీల రేటు 3.08 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 95.59 శాతానికి తగ్గింది. బుధవారం 84,825 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.63 కోట్ల మందికి కరోనా సోకగా, 3.47 కోట్ల మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 380 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు మొత్తం 4.85 లక్షల మంది కరోనాకు బలయ్యారు. టీకా కార్యక్రమానికి సంబంధించి బుధవారం 76 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 154 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 1518 ఏళ్ల మధ్య వయసు వారికి దాదాపు 3 కోట్లకు పైగా డోసులు అందాయి. 26,73,385 మందికి ప్రికాషనరీ డోసు పంపిణీ ఆయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News