హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 94,189 మందికి కరోనా పరీక్షలు చేయగా, 2,493 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 15 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 3,308 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,254 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,80,844కి చేరింది. ఇప్పటివరకరు మొత్తం రికవరీలు 5,44,294కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.52 కోట్ల మందికిపైగా కరోనా టెస్టులు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)318 కేసులు, నల్గొండ (165), రంగారెడ్డి (152) కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ తెలిపింది.
Telangana records 2493 new #COVID19 cases, 3308 recoveries, and 15 deaths today; case tally at 5,80,844 pic.twitter.com/jBmBTaQ3zO
— ANI (@ANI) June 1, 2021
2493 new covid-19 cases reported in telangana