- Advertisement -
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్షల 24వ వార్షికోత్సవాలను పాక్ సైన్యం శనివారం నిర్వహించింది. అణ్వస్త్ర పరీక్షల ద్వారా పాకిస్తాన్ స్వీయ అణు సమృద్ధి దేశంగా, కవ్వింపు చర్యలు లేకుండా తనకు తానుగా అణ్వస్త్రాలను ఉపయోగించని దేశంగా ఆవిర్భవించిందని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. దక్షిణాసియాలో సమతుల శక్తిని పాక్ తన అణ్వస్త్ర సామర్ధంతో నెలకొల్పినట్లు సైన్యం తెలియచేసింది. 1998 మే 28న యామ్ ఎ తక్బీర్ సంకేత నామంతో పాకిస్తాన్ నిర్వహించిన అణు పరీక్షల 24 వార్షికోత్సవాలను పురస్కరించుకుని పాకిస్తాన్ సైన్యం, విదేశాంగ శాఖ వేర్వేరుగా ప్రకటనలు జారీచేశాయి. 1998 మేలో పోఖ్రాన్‌లో భారత్ వరుసగా ఐదుసార్లు అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించిన దరిమిలా పాకిస్తాన్ కూడా అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించింది.
- Advertisement -