- Advertisement -
ఢిల్లీ: మూడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 25.41 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ రాష్ట్రాలలో పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం-27.34, బిహార్-24.41, ఛత్తీస్‌గఢ్-29.9 శాతం, దాద్రానగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్-24.69 శాతం, గోవా-30.94 శాతం, గుజరాత్-24.35 శాతం, కర్నాటక-24.48 శాతం, మధ్యప్రదేశ్-30.21, మహారాష్ట్ర-18.18, ఉత్తర ప్రదేశ్-26.12, పశ్చిమ బెంగాల్‌లో 32.82 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. మూడో దశలో 11 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది.
- Advertisement -