Thursday, November 14, 2024

ఇరాన్ ముట్టడించిన నౌక నుంచి భారత నావికురాలు విడుదల

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ కు చెందిన నౌకను ఇరాన్ మిలిటరీ ముట్టడించిన సంగతి తెలిసిందే . అందులో చిక్కుకున్న నేవీ బృందంలో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు. వారిలో మహిళా నావికురాలు అన్ టెస్సా జోసెఫ్ అనే ఏకైక నావికురాలిని గురువారం విడుదల చేశారు. టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్ ప్రభుత్వంతో సాగించిన సంప్రదింపులు ఫలించి మార్గం సుగమమైంది. కేరళ లోని త్రిస్సూర్‌కు చెందిన జోసెఫ్ గురువారం మధ్యాహ్నం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ స్వాగతం పలికారు. మిగతా 16 మంది భారతీయ నావికుల విడుదల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News