Sunday, December 22, 2024

24 గంటల్లో 25 ప్రసవాలు

- Advertisement -
- Advertisement -

మెదక్ : జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 25 ప్రసవాలు జరిపి అరుదైన రికార్డు సాధించారు. గతంలో తమ ఆస్పత్రిలో 23 ప్రసవాల రికార్డును తామే బుధవారం బ్రేక్ చేసినట్లు ఆస్పత్రివర్గాలు తెలిపారు. ఈ ప్రసవాలు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం ఉ దయం 10 గంటల వరకు జరిగాయి. 25 ప్రసవాలలో 12 సాధారణ, 13 సిజేరియన్ ద్వారా జరగగా, 17 మంది మగ శిశువులు, 8 మంది ఆడ శిశువులు జన్మించారు. తెలంగాణ ప్రభుత్వంలో వైద్యానికి పెద్దపీట వేస్తూ నూతన ఒరవడులతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అంతేకాకుండా జిల్లా మంత్రి హరీశ్ రావు వైద్యారోగ్య శాఖ చేపట్టినప్పటి నుంచి మరింత మెరుగైన సేవలు వైద్య విధానంలో చోటు చేసుకున్నాయి.

దానికితోడు కెసిఆర్ కిట్‌తోపాటు గర్భం దాల్చినప్పటినుంచి ప్రభుత్వం నుంచి పౌష్టికాహారాలను అందజేయడమే కాకుం డా వారికి సరియైన సమయంలో మెరుగైన వైద్యా న్ని ప్రభుత్వం అందిస్తుంది. పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసిహెచ్) ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు పదికి తగ్గకుండా ప్రసవాలు జరుగుతున్నాయి. అందుకుతోడు ఆస్పత్రిలో 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండి పేషెంట్లు ఏ సమయంలో వచ్చిన సరైన వైద్యం అందించడంలో డాక్టర్లు సఫలికృతమవుతున్నారు. ఆస్పత్రి ఇన్‌చార్జి గైనకాలజిస్టు డాక్టర్ శివ దయాల్ నేతృత్వంలో సిబ్బందితోపాటు మిగతా డాక్టర్ల సహకారం ఉండటంతో ఈ ఘనత సాధించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ పి. చంద్రశేఖర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News