భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉండనున్నాయట. ఎందుకంటే భూమి నుంచి చంద్రుడు నిదానంగా దూరం అవుతున్నాడట. చంద్రుడు…సూర్యుని చుట్టూ తిరిగే వేగం కాలక్రమేణ తగ్గుతోందట. ఇలాగే కొనసాగితే భూమి, చంద్రుని మధ్య ధూరం పెరిగి వెన్నెల రాత్రుల తగ్గొచ్చని శాస్త్రవేత్తల అంచనా. విస్కాన్సిస్-మాడిసన్ విశ్వవిద్యాలయ బృందం నిర్వహిచిన పరొశోధన ప్రకారం చంద్రుడు సంవత్సరానికి 3.8 సెంటీ మీటర్ల చొప్పున భూమి నుంచి దూరం జరుగుతున్నాడు. ఇలాగే కొనసాగితే 200 మిలియన్ సంవత్సరాల కాలంలో భూమిపై రోజుకు 25 గంటలు ఉండే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడయింది.
1.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద రోజుకు 18 గంటలు ఉండేవి. వాతావరణ మార్పు, భూమి, చంద్రుని మధ్య దూరం పెరిగి నెమ్మదిగా రోజుకు 24 గంటలకు చేరింది. కానీ రానున్న కాలంలో 24 గంటలు కాస్తా 25 గంటలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆ కాలాన్ని మనం చూడలేము. ఎందుకంటే దానికి దాదాపు 200 బిలియన్ సంవత్సరులు పడుతుందని అంచనా.