యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ)లో 25 మంది భారతీయులకు మరణ శిక్ష విధించారని, అయితే తీర్పు ఇంకా అమలు కావలసి ఉందని ప్రభుత్వం గురువారం పార్లమెంటుకు తెలిపింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన జవాబులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. విదేశాల్లో ఎంత మంది కారాగారాల్లో మగ్గుతున్నారు, ఎంత మందికి మరణ శిక్ష విధించారు అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వారి ప్రాణాలు కాపాడడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా అన్నారు. ‘మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, విదేశీ జైళ్లలో ప్రస్తుతం విచారణలో ఉన్న ఖైదీలలో భారతీయ ఖైదీల సంఖ్య 10152’ అని ఆయన తెలిపారు. విదేశీ జైళ్లలో ఉన్న వారు సహా విదేశాల్లోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, శ్రేయస్సకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు
యుఏఈలో 25 మంది భారతీయులకు మరణ శిక్ష
- Advertisement -
- Advertisement -
- Advertisement -