Monday, January 20, 2025

25 కిలోల నగలు కొట్టేసిన దొంగ

- Advertisement -
- Advertisement -

కోయంబత్తూరులో భారీ దొంగతనం జరిగింది. గాంధీపురంలో ఉన్న ప్రముఖ జ్యుయలరీ సంస్థ జోస్ అలుక్కాస్ అండ్ సన్స్ దుకాణంలో సోమవారం అర్థరాత్రి 25 కిలోల నగలు చోరీ అయ్యాయి. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా, ముసుగు ధరించిన ఒక దొంగ రాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది.

మంగళవారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బంది… షాపులో నగలు, ఇతర వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగ దుకాణానికి వెనుక ఉన్న గోడను పగులగొట్టి లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. దొంగను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసు అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News