Saturday, December 28, 2024

బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..25మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఓ టూరిస్ట్ బస్సు, ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో దాదాపు 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి బహియా రాష్ట్రంలోని ఫెడరల్ రహదారిపై ఓ మినీ టూరిస్టు బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా.. వెంటనే వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News