- Advertisement -
బీజింగ్: చైనాలో గ్యాస్‌పైప్‌లైన్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. హుబే రాష్ట్రంలోని షియాన్ నగరంలో ఆదివారం గ్యాస్‌పైప్‌లైన్ పేలిన ఘటనలో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టమైన విషయం తెలిసిందే. శిధిలాలు తొలగిస్తున్న క్రమంలో సోమవారం రాత్రి వరకు 25 శవాలు లభ్యమయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తునకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు. గ్యాస్ పైప్‌లైన్ల నిర్వహణలో లోపాల వల్ల చైనాలో ఏటా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉండటం గమనార్హం. 2015లో తియాంజిన్ పోర్టు ప్రాంతంలో జరిగిన ఘటనలో 173మంది చనిపోగా వందలాదిమంది గాయపడ్డారు.
- Advertisement -