Friday, November 22, 2024

బిజాపూర్‌లో 25 మంది నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో సోమవారం 25 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. వారిలో ఐదుగురిపై మొత్తం రూ. 28 లక్షల బహుమతి ఉంది. 25 మంది నక్సల్స్ నిషిద్ధ సిపిఐ (మావోయిస్ట్) గంగ్లూర్, భైరామ్‌గఢ్ ఏరియా కమిటీల్లో క్రియాశీలకంగా ఉన్నారని, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు. డొల్ల మావోయిస్ట్ సిద్ధాంతం పట్ల, నిషిద్ధ నక్సల్ నేతలు గిరిజనులపై సాగిస్తున్న అత్యాచారాల పట్ల నిరాశ చెంది వారు లొంగిపోయారని బిజాపూర్ ఎస్‌పి జితేంద్ర కుమార్‌యాదవ్ చెప్పారు.

ఆయుధాలు త్యజించినవారికి ఒక్కొక్కరికి రూ. 25 వేలు వంతున ఆర్థిక సాయం అందజేసినట్లు, వారికి ప్రభుత్వ విధానం ప్రకారం, పునరావాసం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ‘తాజా లొంగుబాటుతో జిల్లాలో ఈ ఏడాది ఇంత వరకు 170 మంది నక్సలైట్లు హింసాకాండకు స్వస్తి పలికారు. అదే సమయంలో జిల్లాలో 346 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం’ అని ఎస్‌పి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News