హైదరాబాద్: శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో శుక్రవారం అర్థరాత్రి నిర్వహించిన తనిఖీలలో వీసా గడువు ముగిసిన 25మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న విదేశీయులే టార్గెట్‌గా 40 ఇళ్లలో ఏకకాలంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నవారిలో జబర్దస్త్ చార్లెస్ చిచ్చా కూడా ఉన్నాడు. చార్లెస్ చిచ్చా వీసా గడువు ముగిసి రెండేళ్లు అవుతోంది. ఇదిలావుండగా పాపులర్ హిట్ సాంగ్స్‌ను తెలుగులో పాడి చిచ్చా చార్లెస్ జబర్దస్త్ సహా పలు షోలలో ప్రదర్శనలిచ్చాడు. యుగాండా దేశానికి చెందిన చిచ్చా వచ్చీ రానీ తెలుగుతో మాట్లాడుతూ పలువురిని ఆకట్టుకుంటున్నాడు. చదువుకునేందుకు వరంగల్ వచ్చిన చార్లెస్ తన పాటలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక ఆఫ్రికా, సోమాలియా, కాంగో, నైజీరియా, యుగాండా దేశస్తులు చాలా మంది వీసా గడువు ముగిసిన ఇక్కడి నుంచి వెళ్లకపోవడంతో పోలీసులు వీరిపై ప్రత్యేకంగా దృష్టి సారించి కార్డెన్‌సెర్చ్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కార్డన్ సర్చ్.. 25 మంది నైజీరియన్ల అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -