Monday, January 20, 2025

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 25 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన ఘటన శుక్రవారం రాత్రి 2 గంటల సమయంలో చోటు  చేసుకుంది.. నాగాపూర్ నుంచి పూణె వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు టైరు పేలడంతో బస్సు అదుపు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ఉన్నారు.

25 మంది సజీవ దహనం అవ్వగా, మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News