Tuesday, January 21, 2025

విద్యుత్ షాక్‌తో 25 గొర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

మరిపెడ: విద్యుత్ షాక్‌తో 25 గొర్రెలు మృతి చెందగా, మరికొన్ని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తానంచర్ల గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఈర్ల గంగాధర్ తనకున్న 90 శాల్తీల గొర్రెలను రోజువారిగా మేపుకొని వచ్చి ఇంటి వెనుకాల ఉన్న దొడ్డిలో తోలి దొడ్డి ముందు కాపల పడుకుంటాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మబ్బులు పట్టి ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచడంతో గొర్రెల కాపరి ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు.

ఇదే క్రమంలో దొడ్డి ముందుకు ఓ కుక్క రావడంతో గొర్రె జీవాలు ఒక్కసారి బెదిరి దొడ్డి గోడ దూకేందుకు ప్రయత్నించే క్రమంలో గోడపై ఉన్న విద్యుత్ సర్వీస్ తీగ తెగి గొర్రెల మందపై పడటంతో విద్యుత్ షాక్‌కు గురైన 25 గొర్రె పోతులు అక్కడికక్కడే మృతి చెందగా మరికొన్ని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయని, మృతి చెందిన 25 గొర్రె పోతుల విలువ సుమారు రూ. 2. 50 లక్షలు ఉంటుందని బాధితుడు ఈర్ల గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశాడు. 25 గొర్రె పోతులు మృతి చెందడంతో ఆర్ధికంగా నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News