అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. 25000 కిలోల డ్రగ్స్ సరఫరాపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. విశాఖ కంటైనర్ పోర్టులో కస్టమ్స్, సిబిఐ అధికారులు భద్రతలో డ్రగ్స్ కంటైనర్ ఉంది. సిబిఐ ప్రత్యేక అధికారుల బృందం విశాఖలోనే మకాం వేసింది. కంటైనర్‌కు సంబంధించి రికార్డులు, ప్రతాలను సిబిఐ అధికారుల బృందం తనిఖీలు చేస్తుంది. ఈ 16న చైనా నౌక ద్వారా కంటైనర్ విశాఖ వచ్చినట్టు గుర్తించారు.
సంధ్య ఆక్వా పేరిట కంటైనర్ బుక్ అయ్యిందని, బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుంచి డ్రైడ్ ఈస్ట్ బ్యాగులతో కంటైనర్ వచ్చినట్టు గుర్తించారు. కంటైనర్‌ను స్క్రీనింగ్ చేయగా డ్రగ్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇంటర్ పోల్ సమాచారంతో కంటైనర్ కోసం నౌకను సిబిఐ ట్రాక్ చేసింది. విశాఖపట్నంలో కంటైనర్ దించి తమిళనాడు కట్టుపల్లి పోర్టుకు నౌక వెళ్లినట్టు సమాచారం. డ్రగ్స్ కంటైనర్‌ను విశాఖలో దించి నౌక సిబ్బంది ద్వారా సిబిఐ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, కస్టమ్స్ అధికారులు నౌకలో తనిఖీలు చేపట్టారు.
కంటైనర్‌లో 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగుల్లో డ్రైడ్ ఈస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న సేకరించిన 49కి గాను 27 నమూనాల్లో డ్రగ్స్‌ను గుర్తించారు. సంధ్య ఆక్వా సంస్థలో రెండు రోజుల క్రితమే సిబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంధ్య ఆక్వా పరిశ్రమలో రికార్డులను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రొయ్యల ఆహార తయారకీకి కాంపోజిషన్ దిగుమతి చేసుకన్నట్టు కంపెనీ వెల్లడించింది. కాంపోజిషన్ దేనితో తయారు చేస్తారో తమకు తెలియదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.