Monday, December 23, 2024

తుపాకీతో కాల్చుకుని 25 ఏళ్ల నావికుని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముంబై : భారత నావికాదళానికి చెందిన 25 ఏళ్ల నావికుడు విధి నిర్వహణలో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నేవీ యుద్ధ నౌక ఐఎస్‌ఎస్ చెన్నైపై విధి నిర్వహిస్తూ శనివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఆత్మహత్య చేసుకోడానికి దారి తీసిన కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు. అయితే తన కుటుంబ సమస్యల వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. రివాల్వర్‌ను, మేగజైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేసి కొలాబా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News