- Advertisement -
సూర్యాపేట: హుజూర్‌నగర్ ఎక్పైజ్ శాఖ ఎస్‌ఐలు, సిబ్బంది దాడులు జరిపి 250 కేజీల బెల్లం, ఐదు లీటర్ల సారాయిని పట్టుకున్నారు. బుధవారం ఆంధ్రప్రదే శ్ రాష్ట్రం జగ్గయ్యపేట నుండి హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం కొత్తతండాకు బెల్లం, సారాయిను ఆటోలో తరలిస్తుండగా కొత్తతండా శివారులో హుజూర్‌నగర్ ఎక్పైజ్ శాఖ ఎస్‌ఐలు దివ్య, వెంకన్న, సతీష్‌లు సిబ్బందితో కలిసి దాడులు చేసి బానోతు హుస్సేన్, జానులను అదుపులోకి తీసుకుని, వారి వద్దనుండి 250 కేజీల బెల్లం, మూడు లీటర్ల సారాయిను స్వాధినం చేసుకోవడం జరిగింది. మరో వ్యక్తి బానోతు బాల తనబైక్‌ను వదిలి పరారుకాగా, పరారైన వ్యక్తి వదిలిపెట్టి వెళ్ళిన బైక్, రెండు లీటర్ల సారాయిని స్వాధినపర్చుకున్నారు.
- Advertisement -