Friday, December 20, 2024

న్యూజిలాండ్‌లో మృత్యువాత పడ్డ 250 పైలట్ తిమింగలాలు

- Advertisement -
- Advertisement -

Pilot Whales die in New Zealand

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని మారుమూల చాతం ద్వీపంలో సముద్రతీరానికి వెళ్లిన తర్వాత దాదాపు 250 పైలట్ తిమింగలాలు అక్కడ చిక్కుకుపోయి చనిపోయాయి. కాగా  అక్కడ షార్క్ చేపల రిస్క్ ఎక్కువని న్యూజిలాండ్ ప్రభుత్వం తెలిపింది. డాల్ఫిన్ కుటుంబానికి చెందిన ‘పైలట్ తిమింగలాలు’ శుక్రవారం ద్వీపానికి వాయువ్య ప్రాంతంలో చిక్కుకుపోయినట్లు న్యూజిలాండ్ పరిరక్షణ విభాగం తెలిపింది.”మానవులు,  తిమింగలాలపై  షార్క్ దాడి చేసే ప్రమాదం ఉన్నందున మేము చాతం దీవులలో తిమింగలాలను తిరిగి సముద్రంలోకి పంపడం(రీఫ్లోట్) చేయము” అని ఆ ప్రభుత్వ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అక్కడ చిక్కుకుపోయిన పైలట్ తిమింగలాలు ఇప్పుడు చనిపోయాయి, వాటి మృతదేహాలు అక్కడ సహజంగా కుళ్ళిపోయేలా వదిలివేయబడతాయి” అని ఆ పరిరక్షణ విభాగం తెలిపింది. పైలట్ తిమింగలాలు  ఆరు మీటర్ల (20 అడుగులు) కంటే ఎక్కువ పొడవు పెరగగలవు, పైగా చాలా స్నేహశీలియైనవి, కాబట్టి అవి ప్రమాదానికి దారితీసే ‘పాడ్-మేట్‌’లను అవి అనుసరిస్తుంటాయి. న్యూజిలాండ్‌లో, అధికారిక గణాంకాల ప్రకారం సంవత్సరానికి దాదాపు 300 తిమింగలాలు తమంతట తాము సముద్రతీరానికి చేరుకుంటాయి,  20 నుంచి 50 మధ్య పైలట్ తిమింగలాలు గుంపులుగా పరుగెత్తడం అసాధారణమేమి కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News