Monday, January 27, 2025

250 క్వింటాళ్ళ రేషన్ బియ్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కొడంగల్‌ః అంతర్ రాష్ట్ర సరిహద్దు గుండా కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పోలీసులు గురువారం స్వాధినం చేసుకున్నారు. కొడంగల్ ఎస్సై రవిగౌడ్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున పట్టణంలోని అంబేధ్కర్ చౌరస్తలో వాహనాల తనిఖీలు పోలీసులు చెపట్టారు. అదే సమయంలో తాండూరు నుండి జిజే36టి9325 నంబరు గల లారీలో రేషన్ బియ్యాన్ని కర్నాటక రాష్ట్రం గుర్మిట్కల్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

లారీని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించి, ఎన్‌ఫోర్స్‌మేంట్ డిటి గణపత్‌రావుకు సమాచారం అందించారు. పంచనామ నిర్వహించిన డిటి లారీ డ్రైవర్ మాజీద్ ఖాన్, యజమాని ఇల్‌ముద్దీన్‌లతో పాటు బియ్యం అక్రమ రావాణాకు పాల్పడిన వ్యాపారి రాజులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News