మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో మరో 2,434 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ముందుగా కన్వీనర్ కోటాలో 70,307 ఇంజనీరింగ్ సీట్లకు సాంకేతిక వి ద్యాశాఖ అనుమతి ఇవ్వగా, తాజాగా అందుబాటులోకి వచ్చిన సీట్లతో కన్వీనర్ కోటా సీట్లు 72,741కు పెరిగాయి. ఈ విద్యాసంవత్సరం జెఎన్‌టియుహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీలలో మొత్తం 1,01,661 సీట్లు అందుబాటులో ఉండ గా, 70 శాతం కన్వీనర్ కోటా కింద 72,741 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని స్పష్టం చేసింది.
అ త్యధికంగా సిఎస్‌ఈలో 22,943.. సిఎస్‌ఇ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్)లో 11,574 సీట్లు ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అం డ్ డాటా సైన్స్‌లో 1365 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 606 సీట్లు, సి ఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టె క్నాలజీ)లో 126 సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ)లో 1,344 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా వె బ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ బుధవారం(జులై 17) ముగియనున్నది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన బ్రాంచీలను విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు వీలుగా మంగళవారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ఈ నెల 19వ తేదీన మొదటి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించాల్సి ఉండగా, వెబ్ ఆప్షన్ల నమోదు గడువును పొడిగించిన నేపథ్యంలో ఈ నెల 21 తర్వాత సీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో 1,84,424 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 99,170 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు. వారిలో మంగళవారం సాయంత్రం వరకు 95,383 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.