Sunday, April 6, 2025

ప్రతి మహిళకు నెలకు రూ.2500: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే పేదలకు రూ.500 లకే సిలిండర్ ఇస్తామని, పేదలు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి రూ. లక్ష నగదు, తులం బంగారం ఇస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News