Monday, December 23, 2024

పంజాబ్ ముఖ్యమంత్రి తొలి నిర్ణయం: 25వేల మందికి ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

Bhagwant Mann's cabinet
అమృత్‌సర్: పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం మొత్తం 25వేల ప్రభుత్వ ఉద్యోగాల ప్రతిపాదనను తన తొలి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది. ఆ 25 వేల ఉద్యోగాల్లో 10వేల ఖాళీలు పంజాబ్ పోలీస్ శాఖవి కాగా, మిగతా 15వేల ఉద్యోగాలు ఇతర శాఖలకు చెందినవి. ఈ నిర్ణయంతో పంజాబ్‌లోని యువతకు కొంత మేరకైనా ఉద్యోగాలు లభించనున్నాయి. అక్కడ పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా ఉద్యోగకల్పన ఉండగలదని తెలుస్తోంది. ‘ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన నెల రోజుల్లో వెలువడనుంది’ అని ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. ముఖ్యమంత్రి మాన్ అధ్యక్షతన జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో మొత్తం 10 మంది మంత్రులు పాల్గొన్నారు. విశేషమేమిటంటే వారిని శనివారమే పదవుల్లోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News