Sunday, January 19, 2025

25 వేల మంది టీచర్ల నియామకాలు రద్దు

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: స్టేట్ లెవల్ సెలెకన్‌టెస్ట్-2016(ఎస్‌ఎల్‌ఎస్‌టి) నియామక ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలలలో జరిగిన టీచర్ల ని యమాకాలను అక్రమంగా తేలుస్తూ 25,753 నియ మాకాలను కలకత్తా హైకోర్టు సోమవారం రద్దు చేసింది. నియమక ప్రక్రియకు సంబంధించి తదుపరి దర్యాప్తు జ రిపి మూడు నెలలలో నివేదికను సమర్పించాలని జస్టిస్ దేబంగ్సు బసక్, మొహమ్మద్ షభర్ రషీదీలతో కూడిన డివిజన్ బెంచ్ సిబిఐని ఆదేశించింది. నాలుగు వారాల లో తాము తీసుకున్న జీతాలను వాపసు చేయాలని డివి జన్ బెంచ్ అక్రమంగా నియమితులైన టీచర్లు, నాన్ టీ చింగ్ సిబ్బందిని ఆదేశించింది. వారి నుంచి డబ్బును వ సూ లు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు హైకోర్టు అప్ప గిం చింది. తాజా నియామక ప్రక్రియను చేపట్టాలని ప శ్చి మ బెంగాల్ స్కూల్ సర్వీస్ తరువాయి 10లో
(మొదటిపేజీ తరువాయి)
కమిషన్(ఎస్‌ఎస్‌సి)ని డి విజన్‌బెంచ్ ఆదేశించింది. 24,640 ఖాళీ పోస్టుల కోసం ఎస్‌ల్‌ఎస్‌టి-2016కి 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. కాగా ఖాళీలు 24,640 ఉండగా 25,753 నియామక లేఖలు జారీ చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఫిర్దౌస్ షమీమ్ తెలిపారు. కాగా.. ఈఉత్తర్వుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరినప్పటికీ డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళతామని ఎస్‌ఎస్‌సి చైర్మన్ సిద్ధార్థ్ మజుందార్ తెలిపారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత వెలుపల వేచి ఉన్న వందలాది మంది ఉద్యోగార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కొందరు ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. కొన్నేళ్లుగా తీర్పు కోసం పోరాటం సాగిస్తున్నామని, ఎట్టకేలకు న్యాయం తమకు దక్కిందని వారు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ ఏర్పాటు చేశారు.

కాగా 9,10.11,12 తరగతులకు టీచర్లను, గ్రూప్ సి, డి సిబ్బందిని ఎస్‌ఎస్‌ఎస్‌టి2016 ద్వారా కేటగిరీల వారీగా నియామకాల కోసం అభ్యర్థులను ఎస్‌ఎస్‌సి ఎంపిక చేయడానికి సంబంధించి పెద్ద సంఖ్యలో దాఖలైన పటిషన్లను డివిజన్ బెంచ్ సుదీర్ఘంగా విచారించింది. మార్చి 20న వాదనలు పూర్తి కాగా తీర్పును డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. పరీక్షకు హాజరై ఉద్యోగాలు దొరకని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని కలకత్తా హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచ్ నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సిబిఐ దర్యాప్తును ఆదేశించింది. అంతేగాక అక్రమాలు నిజమని తేలడంతో టీచింగ్, నాన్ టీచింగ్‌కు చెందిన అనేక ఉద్యోగాలను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తమ వద్ద దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు 2023 నవంబర్ 9న కొట్ట్టివేస్తూ అన్ని పిటిషన్లను, అప్పీళ్లను విచారించడానికి ఒక డివిజన్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరింది.

దీనిపై త్వరితంగా తీర్పును వెలువరించాలని కోరింది. డివిజన్ బెంచ్ ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు వీలుగా ఆరు నెలల పాటు రద్దు చేసిన ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో ఆదేశించింది. తన దర్యాప్తును పూర్తి చేసిన సిబిఐ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. పశ్చిమ బెంగాల్ స్కూలు సర్వీస్ కమిషన్‌లో పదవులు నిర్వహిస్తున్న కొందరు అధికారులతోపాటు మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీని సిబిఐ గతంలోనే అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News