Wednesday, January 1, 2025

గత 24 గంటల్లో 2568 కొవిడ్ కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

Covid-19 cases

న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి కారణంగా దేశంలో ఈ ఏడాది మొత్తంగా 5,15,877 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. గత 24 గంటల్లో 2568 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 27 మరణాలు సంభవించాయని, మొత్త ం సంక్రమణ కేసుల్లో 0.08 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 98.27కు పెరిగిందని ఆమె రాజ్యసభలో సభ్యుడు అబిర్ రంజన్ బిస్వాస్ అడిగిన ఓ ప్రశ్నకు జవాబుగా ఈ విషయాన్ని చెప్పారు. పార్లమెంటుకు సమర్పించిన సమాచారంలో మహారాష్ట్రలో 1,43,745, కేరళలో 66,374, కర్నాటకలో 40,004, తమిళనాడులో 38,019, ఢిల్లీలో 26,139, ఉత్తర్‌ప్రదేశ్‌లో 23,485, పశ్చిమ బెంగాల్‌లో 21,181 మరణించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News