Monday, December 23, 2024

25న నిరుద్యోగ మహా ధర్నా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో.. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద “నిరుద్యోగ మహా ధర్నా” నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో బిజెపి మరో ఆందోళనకు సిద్ధమైంది. బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై చర్చించారు.

25న నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News